16 నెలలు బాగానే పాలించాడు .. ఇప్పుడు మొదలైంది జగన్ కి బిగ్ బాస్ బిగ్ ఛాలెంజ్ !

Ys Jagan

ప్రజలకు సహాయం చేయడానికి మొదలైన సంక్షేమ పథకాలు ఇప్పుడు రాజకీయ నాయకులు తమ అధికారంలోకి రావడానికి వాడుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా అధికారంలోకి రావడానికి ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో వల వేస్తున్నారు. ఇలా అనవసరపు హామీలు ఇస్తూ ప్రజలను రాజకీయ నాయకులే సోమరిపోతులను చేస్తున్నారని కొందరు వాదిస్తుంటారు. అయితే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాజకీయ నాయకులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు సరిగ్గా ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారు.

jagan government facing finacial problems
jagan government facing finacial problems

అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ

రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీ-తెలంగాణ రెండు రాష్ట్రాలుగా 2014లో విడిపోయాయి. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అవతరించగా.. ఏపీ 90వేల కోట్ల అప్పుతో కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. నాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి పేరిట వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు.. రాజధాని నిర్మాణం.. అభివృద్ధి పేరిట వేలకోట్లు అప్పులు చేశారు. టీడీపీ అధికారంలోకి దిగిపోయేనాటికి ఏపీ ఖజానా పూర్తిగా డొల్లచేసి పోయారు. ఆ తర్వాత సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం వేల కోట్లు ఖర్చు చేసున్నారు.

కేంద్రాన్ని కోరుతున్న జగన్!

జగన్ 15నెలలు పరిపాలనలో ఏకంగా 97వేల కోట్ల రూపాయాల అప్పులు తెచ్చినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఎలా ఉన్నా ప్రస్తుతం ఏపీ సర్కారుకు బ్యాంకులు నుంచి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్బీఐ రుణపరిమితి కూడా ఏపీకి మించిపోయినట్లు సమాచారం.కేంద్రం ఏపీకి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. గతంలో పెండింగ్ ఉన్న నిధులను కేంద్రం విడుదల చేయాలని పలుమార్లు ఆయన ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. కేంద్రం నుంచి అరకొరగా నిధులు వస్తుండటంతో ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జగన్ సర్కార్ ఆదాయ మార్గాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. 16నెలలు పాలన సాగించిన జగన్ ఇప్పుడు వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.