Rashmika: నావల్ల అల్లు అర్జున్ కి పెద్ద డామేజ్ జరిగింది… రష్మిక సంచలన వ్యాఖ్యలు!

Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది పాన్ ఇండియా స్థాయిలో సుమారు 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇలా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఆయన మ్యానరిజానికి ప్రేక్షకుల ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ పక్కన రష్మిక నటన కూడా హైలైట్ అని చెప్పాలి.

రష్మిక సినీ కెరియర్ లోనే శ్రీవల్లి పాత్ర ఎంతో చెప్పుకోదగ్గ పాత్రనే తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చీర కట్టుకొని ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన రష్మిక రొమాంటిక్ సన్నివేశాలలో మాత్రం భారీ స్థాయిలో గ్లామర్ షో చేశారు. ఇక అచ్చమైన తెలుగింటి భార్యగా భర్త గౌరవాన్ని కాపాడుతూ భర్త అడుగుజాడల్లో నడుచుకునే ఒక భార్య పాత్రలో రష్మిక నటించారు.

ఇక ఈ సినిమా ఇలాంటి సక్సెస్ అందుకుంది అంటే అందుకు కారణం సెలబ్రిటీల ప్రమోషన్స్ కూడా కారణమనే చెప్పాలి. ఇప్పటికి కూడా రష్మిక పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక అల్లు అర్జున్ గురించి మరోసారి ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలో ఫీలింగ్స్ సాంగ్ షూటింగ్ చేసే సమయంలో నేను చాలా భయపడ్డాను నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా పైకి ఎత్తితే వారు ఎక్కడ పడేస్తారోననే ఒక భయం నాలో ఉండేది అందుకే ఈ పాట షూటింగ్ సమయంలో కూడా నేను చాలా భయపడ్డానని కానీ తర్వాత అలవాటైపోయింది అంటూ రష్మిక తెలిపారు. ఇకపోతే ఈ పాట షూట్ చేసే సమయంలో నా చేతి గాజు అల్లు అర్జున్ గారికి గీసుకొని పెద్దగాయం తగిలింది రక్తస్రావం అవుతుందని బ్యాండేజ్ వేసాను. కానీ ఆయన మాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చెయ్యడంలో బిజీ అయ్యారు. కానీ నా వల్ల మీరు బాధపడటం నాకు ఇష్టం లేదని ఆయనకు చెప్పినట్లు రష్మిక చెప్పారు. దీంతో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.