YS Jagan: ప్లీజ్ సైలెంట్… అల్లు అర్జున్ విషయంలో నేతలకు జగన్ కీలక ఆదేశాలు?

YS Jagan: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ని ఒక దోషిని చేస్తూ హైలైట్ చేసింది తెలంగాణ సర్కార్. ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 ముద్దాయిగా ఉన్నారు అయితే అందరినీ కాదని ఈయనని మాత్రమే అరెస్టు చేయడంతో కచ్చితంగా తెలంగాణ సర్కార్ అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఇలా ఆయనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్పష్టమవుతుంది ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పట్ల ఎంతోమంది నేతలు స్పందిస్తూ ఈ విషయాన్ని తప్పు పడుతున్నారు.

కాంగ్రెస్ నేతలు మాత్రం అల్లు అర్జున్ తప్పును తెలియజేస్తూ ఉండగా బీజేపీ వైకాపా బి ఆర్ ఎస్ నాయకులు మాత్రం అల్లు అర్జున్ పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఇక వైకాపా నాయకులు కొంతమంది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు స్పందిస్తూ ఖండించారు కానీ ఇప్పటివరకు ఎవరో కూడా ఈ విషయం గురించి పెద్దగా స్పందించలేదు.

ఈ విధంగా వైకాపా నాయకులు అల్లు అర్జున్ విషయంలో మాట్లాడకపోవడానికి కారణం తమ నాయకుడు జగన్ ఆదేశాలే కారణమని తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనే విషయం తెలిసిన వెంటనే మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి నాగబాబు ఇంటికి కూడా వెళ్లారు ఇలా వెళ్లడంతో మెగా కుటుంబమంతా ఒకటేనని చెప్పకనే చెప్పేశారు.

ఇకపోతే అల్లు అర్జున్ అరెస్టు కావటం పట్ల వైకాపా నాయకులు ఖండించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎవరు ఎక్కువగా మాట్లాడుకూడదని పూర్తిగా సైలెంట్ అవ్వాలని ఆదేశాలు జారి చేయడంతోనే తమ అధినేత ఆదేశాలు మేరకు ఎవరు కూడా అల్లు అర్జున్ విషయం మాట్లాడటం లేదని స్పష్టమవుతుంది.ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే అభిప్రాయానికి వైసీపీ కార్యకర్తలు అలాగే వైసిపి నాయకత్వం వచ్చినట్లుగా క్లియర్ పిక్చర్ వస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేశాడు. హైకోర్టులో అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా ఆయనే. అలాగే వైసిపి న్యాయవిభాగం కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలబడింది అయితే ఈ పరిణామాలు నచ్చకపోవడం వల్లే వారు మరింత దగ్గర అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో వైసిపి సైడ్ అయిందని తెలుస్తోంది.