Pawan Kalyan: జగన్ అడ్డాలో పవన్ మాస్ వార్నింగ్… తోలుతీస్తా అంటూ?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కడవ పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన మన్యం ప్రాంతాలలో పర్యటిస్తూ ఉండగా ఉన్నఫలంగా కడపకు వెళ్లారు. అయితే కడపలో ఇటీవల వైకాపా నాయకులు చేసిన దాడి ఘటనలో భాగంగా గాయపడినటువంటి వైఎస్సార్ జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

ఇలా వైకాపా నేతల దాడిలో గాయపడినటువంటి జవహర్ బాబు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయనపై దాడి జరిగిందనే విషయం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే కడప వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడికి వెళ్లి జోహార్ బాబుని పరామర్శించడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను కూడా పలకరించారు అనంతరం వైకాపా నేతలకు తనదైన శైలిలోనే మాస్ వార్నింగ్ ఇచ్చారు.

జవహర్ బాబు పై దాడి చేసిన వ్యక్తిగతంలో లాయర్ అని తెలుస్తుంది.వాళ్ల అమ్మ ఎంపీపీ అని, ఆమె ఆఫీసులో వెళ్లేందుకు వీళ్లకు అనుమతి లేకపోయినా ఎంపీడీవో వద్దకు వెళ్లి తాళాలు ఇవ్వకపోతే దాడి చేశారన్నారు. ఒక మండలానికి కలెక్టర్ స్థాయిలో బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి ఎంపీడీవో పట్ల దాడి చేయడం అంటే ఒక్కరిపై దాడి చేసినట్లు కాదని రాష్ట్ర యంత్రాంగం పైనే దాడి చేసినట్లు అని పవన్ తెలిపారు.

వైసీపీ అహంకారం తగ్గే వరకూ మిమ్మల్ని వదలం అన్నారు. అహంకారంతో కొట్టుకునే మీకు 11 స్థానాలు మాత్రమే వచ్చాయని పవన్ తెలిపారు.ఇది గత ప్రభుత్వంలా కాదని, ఇష్టారాజ్యంగా చేస్తామంటే కుదరదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. దీనిపై కలెక్టర్ కూడా స్పందించారన్నారు. వైసిపి నేతల అహంకారం నడి నెత్తి మీద ఉందని తోలు తీసి కింద కూర్చో పెడతాను అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇష్టా రాజ్యంగా చేస్తామంటే ఈ ప్రభుత్వంలో కుదరదన్నారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ గాల్లో విహరిస్తోందని జగన్ కంచుకోట అయినటువంటి కడపలో వైకాపా నాయకులకే ఈయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.