YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజులకు పులివెందుల పర్యటనలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి జగన్ నిన్న పార్టీ క్యాంపు కార్యాలయంలో పులివెందులలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పులివెందుల నియోజకవర్గానికి చెందినవారు మాత్రమే కాకుండా రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
ఈ విధంగా జగన్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఊహించని విధంగా అభిమానులు ప్రజలు తరలి రావటమే కాకుండా వారి సమస్యలన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన కూడా చాలా శ్రద్ధగా వారి సమస్యలను విని వాటి పరిష్కారానికై కృషి చేస్తామని తెలిపారు.
ఇక చాలామంది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలను తెలియచేయడానికంటే కూడా జగనన్నని కలవడానికి వచ్చామని వెల్లడించినట్లు తెలుస్తోంది. రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బారుకు భారీగా ప్రజలు తరలి రావడంతో ఈయనకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదని ఈయన మాస్ లీడర్ అని మరోసారి నిరూపించుకున్నట్టు తెలుస్తుంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను దూరం చేశారని అందుకే ఓటు రూపంలో ప్రజలందరూ తనకు బుద్ధి చెప్పారు అంటూ కూటమి నేతలు విమర్శించారు. కానీ ప్రజలలో జగనన్నకు ఉన్నటువంటి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని మరోసారి ఈ ప్రజా దర్బార్ నిరూపించిందని ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం పార్టీకి, వైకాపా నాయకులలో మరింత భరోసాని కల్పించిందని తెలుస్తుంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లాలోనూ రెండు రోజులపాటు బస చేస్తూ అక్కడ నేతలు కార్యకర్తలను కలవబోతున్న సంగతి తెలిసిందే.
