బాబాయ్ చేయవలసిన సినిమాని అబ్బాయి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న బాలయ్య!

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కొట్టి మూవీ టీం యొక్క జీవితాలనే మార్చేస్తాయి. ఇప్పటివరకు అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి సింహాద్రి. సింహాద్రి సినిమా రాజమౌళిని డైరెక్టర్ గా స్టార్ ని చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా స్టార్ ని చేసింది. ఆ రోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ మాస్ హీరోగా ఆడియన్స్ కి బాగా దగ్గరయిపోయాడు. అయితే నిజానికి ఈ సినిమాని నందమూరి నటసింహం బాలకృష్ణ చేయాల్సిందట.

అసలేం జరిగిందంటే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ అని అందరికీ తెలిసిందే అలాగే సింహాద్రి స్టోరీ ని బాలకృష్ణ కోసం రాసి బి గోపాల్ డైరెక్షన్లో సినిమా చేయాలని అనుకున్నారట. ఈ కథని బి గోపాల్ కి చూపిస్తే అప్పటికే మరో సినిమాతో గోపాల్ బిజీగా ఉండటంతో కాదని తన కొడుకు అయినా రాజమౌళికి ఇచ్చారుట విజయేంద్ర ప్రసాద్. అయితే రాజమౌళి అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ తీసి ఉన్న అనుభవంతో ఈ కథని ఆయనకి వినిపించడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

ఈ సినిమా తీసే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ వయసు 20 సంవత్సరాలు కావటంతో సినిమాని హ్యాండిల్ చేయగలరా అని అనుమానపడ్డారట రాజమౌళి వాళ్లు. కానీ ఎన్టీఆర్ మీద నమ్మకంతో సినిమాని తీసి ఇండస్ట్రీ కొట్టారు రాజమౌళి అండ్ టీం. అలాగే ముందుగా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ని అనుకున్నారట కానీ ఆమె వసంతం సినిమాతో బిజీగా ఉండటం తో భూమిక ని హీరోయిన్గా తీసుకున్నారు.

ఈ సినిమా బాలకృష్ణ చేసి ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నారు బాలయ్య బాబు ఫ్యాన్స్. అంతేకాదు ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్నారు అని తెగ బాధ పడిపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఎన్టీఆర్ దేవర సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.