Nithish Reddy: పుష్ప స్టైల్ లో నితీష్ రెడ్డి సెలబ్రేషన్స్… రేవంత్ రెడ్డి పై సెటైర్లు పేల్చిన అంబంటి!

Nithish Reddy: నితీష్ రెడ్డి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరని చెప్పాలి.భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి సెంచరీ కొట్టి అద్భుతమైన ఆట తీరును కనపరిచారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశ పర్చినా ఆసీస్‌ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్‌, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు.

ఇలా ఈయన సెంచరీ కొట్టడంతో పెద్ద ఎత్తున నితీష్ రెడ్డి పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈయనకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి ఈయనకు 25 లక్షల రూపాయల బహుమానం కూడా అందజేయబోతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా నితీష్ రెడ్డి సెలబ్రేషన్స్ గురించి మాజీ మంత్రి రాంబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబంటి రాంబాబు నితీష్ రెడ్డి అద్భుతమైన ఆటను కనబరుస్తూ హాఫ్ సెంచరీ చేయడంతో ఆయన పుష్ప లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తగ్గేదే లేదంటూ తన బ్యాటుతో బన్నీ మ్యానరిజం చూపించారు. ఈ విషయంపై అంబంటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోని వేధిస్తూ.. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా..అబ్బా? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఈయన సెటైర్లు పేలిచారు. దీంతో అంబంటి రాంబాబు చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు అల్లు అర్జున్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.