జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న నటుడు వేణు దర్శకుడిగా మారి బలగం అనే సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే పెద్ద సక్సెస్ అందుకున్న వేణు ఇప్పుడు తను నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఎల్లమ్మ అనే పవర్ఫుల్ టైటిల్ తో సినిమాని రూపొందించబోతున్నాడు వేణు. బలగం సినిమాని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు ఈ సినిమాకి కూడా ప్రొడ్యూస్ చేయడం విశేషం.
దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే సినిమాలో కంటెంట్ కచ్చితంగా ఉంటుంది అంటూ అప్పుడే సినిమాపై హైప్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ముందు హీరో పాత్ర కోసం నాచురల్ స్టార్ నాని ని కథానాయకుడిగా ప్రకటించారు అయితే అనివార్య కారణాల వలన నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు తర్వాత ఆ ప్లేస్ లోకి నితిన్ వచ్చాడు. ఇక హీరోయిన్ గా అందాల భామ సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
నిర్మాత దిల్ రాజు ద్వారా సాయి పల్లవిని కలిసిన వేణు సినిమా కథని ఆమెకి వినిపించాడని ఆమెకి కథ నచ్చటంతో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని సినీ వర్గాల టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారంట మూవీ మేకర్స్ ప్రస్తుతం నటీనటులు తమ ప్రస్తుత కమిట్మెంట్స్ ని పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా 2025లో సెట్స్ మీదికి వెళుతుందని సమాచారం.
హరిహర వీరమల్లు, త్రిబుల్ ఆర్ సినిమాలకి డైలాగ్ రైటర్ గా పనిచేసిన సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకి కూడా డైలాగ్స్ రాస్తున్నారు. అయితే సాయి పల్లవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అని అటు మూవీ యూనిట్ గాని ఇటు సాయిపల్లవి గాని అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ వార్తలు రూమర్స్ ఏమో అంటున్నారు కొందరు. ఈ రూమర్ పై మూవీ టీం గానీ సాయి పల్లవి గాని స్పందిస్తారేమో వేచి చూడాలి.