Game changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో అప్పటినుంచి రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఈ సినిమా జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే రాంచరణ్ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మరోవైపు చిత్ర బృందం సైతం వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి, సహు గరపాటి, సుధాకర్ చెరుకూరిలతో ఈ సంవత్సరం జరిగిన చర్చలో గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన చర్చలు జరిగాయి అయితే ఇందులో భాగంగా దిల్ రాజుకు స్వయానా అల్లుడు అయినటువంటి హర్షిత్ రెడ్డి ఈ సినిమాలో ఒకరోజు జరిగిన షూటింగ్ ఖర్చు గురించి మాట్లాడారు.
ఒక సాంగ్ షూటింగ్లో భాగంగా ఒకరోజు భారీ స్థాయిలో ఈ సినిమా కోసం ఖర్చు చేసినట్లు హర్షిత్ రెడ్డి తెలిపారు. అయితే ఎంత మొత్తంలో ఖర్చు చేశారు అనే విషయాన్ని మాత్రం ఈయన వెల్లడించలేదు. ఇక శంకర్ డైరెక్షన్ లో ఒక సాంగ్ షూటింగ్ అంటే ఆ పాట కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే పాట షూటింగ్లో భాగంగా ఒక రోజుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఆ సాంగ్ ఏంటి ఎంత ఖర్చు చేశారు అనేది తెలియాల్సి ఉంది.