YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా పులివెందుల పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈయన డిసెంబర్ 24వ తేదీ పులివెందులకు చేరుకున్నారు. అప్పటి నుంచి పులివెందులలోనే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అయితే తాజాగా నేడు పులివెందుల వైయస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గత మూడు రోజులుగా ఎంతోమంది కీలక నేతలతో భేటీ అవుతూ ఎన్నో దిశ నిర్దేశాలు చేశారు. అయితే నేడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఎంతోమంది అభిమానులు జనం పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి వారి సమస్యలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నారు. ఇలా ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఫిర్యాదులు చేయడం కోసం జనం భారీగా తరలి రావడంతో ఒక్కసారిగా సమీప ప్రాంతం జనాలతో కిక్కిరిసిపోయింది.
కేవలం కడపకు చెందిన వారు మాత్రమే కాకుండా రాయలసీమలోని ఇతర జిల్లాల నాయకులు కీలక నేతలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను చెప్పడంతో జగన్ చాలా ఓపికగా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇక ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందులలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడానికి కుదరలేదు దీంతో తన సోదరుడు అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేవారు. ఇక ప్రస్తుతం ఈయన స్వయంగా పులివెందులలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలన్నింటిని అడిగి తెలుసుకుంటున్నారు.