Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కడపలో ఉన్నారు. ఈయన కడపలో ఇటీవల వైకాపా నాయకులు ఎంపీడీవో జవహర్ బాబు పై దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా గాయాలు పాలైనటువంటి ఎంపీడీవో జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు.
ఇలా కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఈయన అక్కడ ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఈ దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఒక మండలానికి కలెక్టర్ సమానమైనటువంటి ఎంపీడీవో పై దాడి చేయటాన్ని సహించమని గత ప్రభుత్వంలో లాగా ఈ ప్రభుత్వంలో వ్యవహరిస్తామంటే సరిపోదు అంటూ ఈయన వైకాపా నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పాల్గొనడంతో రిపోర్టర్స్ నుంచి ఈయనకు అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అల్లు అర్జున్ అరెస్టు గురించి స్పందించాలి అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇది ఏమాత్రం సంబంధంలేని ప్రశ్న మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం. ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి.
సినిమాను మించిన సమస్యలపై డిబేట్లు పెట్టండి వాటి గురించి చర్చించండి అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్న ఎదురవడంతో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో పలువురు రాజకీయ నాయకులు స్పందించిన అల్లు అర్జున్ మాత్రం ఎక్కడ స్పందించడం లేదు. తాజాగా ఇంతకన్నా పెద్ద సమస్యలు ఉంటే ప్రస్తావించండి అని చెప్పడంతో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఆయన దృష్టిలో చాలా చిన్న సమస్యగా భావిస్తున్నారేమో అందుకే ఇలా రియాక్ట్ అయ్యారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.