త్రిబుల్ ఆర్ డాక్యుమెంటరీ ఇకపై ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

దర్శక దిగ్గజం, అభినవ జక్కన్న అయిన స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా 2022లో విడుదలై ఎంత పెద్ద హిట్ సాధించిందో, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 1300 కోట్లకు పైగా కలెక్షని సాధించడంతోపాటు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొన్ని ఏరియాలలో నెలల తరబడి సినిమాని ప్రదర్శించారంటే సినిమా యొక్క గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమా కోసం వాళ్లు ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని త్రిబుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేశారు డైరెక్టర్ రాజమౌళి. డిసెంబర్ 20వ తేదీన ఆ డాక్యుమెంటరీని థియేటర్లలో కూడా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు గంట నలభై నిమిషాలు ఉన్న ఈ డాక్యుమెంటరీ మంచిగానే కలెక్షన్లు సాధించింది.

ఈ డాక్యుమెంటరీ చిత్రం త్రిబుల్ ఆర్ నిర్మాణాన్ని వివరిస్తుంది.సెట్ ఎలా నిర్మించారో సిబ్బందితో ఇంటర్వ్యూలు కూడా ఇందులో ఉన్నాయి. సినిమా విఎఫ్ఎక్స్ ఎలా చేశారు, సినిమా కాస్ట్యూమ్స్ యాక్షన్స్ సన్నివేశాలు ఎలా తీశారు అనే వీడియోలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ డాక్యుమెంటరీలో అసలు నేపథ్యం, సాంకేతికత అంశాల గురించి చిత్ర బృందం స్వయంగా వివరించండి. అలాగే ఆస్కార్ కి వెళ్ళినా అనుభవం, అక్కడ జరిగిన సంఘటనలు ఆస్కార్ ప్రచారం తదితర అంశాలను ఈ డాక్యుమెంటరీ లో చూపించారు.

మూడేళ్ల ఈ సినిమా ప్రయాణానికి సంబంధించి 20టీబీ ఫుటేజ్ రాగా దాన్ని ఎడిట్ చేయడానికి ఏడాది పట్టిందట.అయితే ఈ డాక్యుమెంటరీ ఈరోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన వారానికే నెట్ఫ్లిక్స్ లోకి రావడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో చూడలేం అనుకున్న వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయవచ్చని సంతోషిస్తున్నారు. ఫిలిం మేకర్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ డాక్యుమెంటరీ దిక్సూచిగా ఉపయోగపడుతుంది అంటున్నారు సినీ క్రిటిక్స్.

RRR: Behind and Beyond | Trailer | SS Rajamouli | NTR & Ram Charan | Netflix India