Allu Arjun: అప్పుడు పొగడని నోర్లు ఇప్పుడు విమర్శిస్తున్నాయా…ఇది సినీ పెద్దలకు తగునా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది అంటూ పలువురు సినిమా సెలబ్రిటీలు సీనియర్ నటులు దర్శకనిర్మాతలు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగిన ఘటనకు ఆయనని బాధ్యున్ని చేసి అరెస్టు చేశారు. అంతేకాకుండా కోర్టు విచారణ పోలీస్ విచారణ అంటూ అల్లు అర్జున్ ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఇలా అల్లు అర్జున్ వ్యవహారం ఏకంగా నిండు సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయనపై మండిపడ్డారు. ఇక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు అలాగే టికెట్లు రేట్లు పెంచడానికి కూడా అనుమతి ఉండదు అంటూ తేల్చి చెప్పారు ఇదే విషయంపై సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడిన ఆయన మాత్రం వెనక్కు తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పి పంపించారు.

ఇక ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ సురేష్ బాబు వంటి వారు పరోక్షంగా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ కారణంగా ఆయన ఇగో కారణంగా సినీ పెద్దలు అందరూ కూడా నేడు ముఖ్యమంత్రి ముందు తలదించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ పూర్తి స్థాయిలో విమర్శలు కురిపించారు. అయితే ఇలా సినిమా సెలబ్రిటీలు పరోక్షంగా అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి అభిమానులు తప్పుపడుతున్నారు.

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక నేషనల్ అవార్డు కూడా రాలేదు అలాంటి అవార్డును సొంతం చేసుకున్న నటుడు అల్లు అర్జున్ ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖ్యాతిని పెంచుతూ ఒక గొప్ప అవార్డు సొంతం చేసుకున్న సమయంలో సినిమా పెద్దలు ఆయన పట్ల పొగడ్తలు కురిపించలేదు. ఇలాంటి ఒక గొప్ప అవార్డు అందుకుంటే సినిమా ఇండస్ట్రీ ఆయనకు సన్మానించాల్సింది పోయి కనీసం ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన తప్పు లేకపోయినా తప్పును చూపెడుతూ విమర్శించడం కరెక్ట్ కాదనే వాదన గట్టిగా వినపడుతుంది.