Bigg Boss 8:మ్యాసివ్ ఫెనామిన్ …భారీ స్థాయిలో వ్యూస్ కైవసం చేసుకున్న బిగ్ బాస్ 8 ఫినాలే!

Bigg Boss 8: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఇటీవల ఎంతో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో భాగంగా నిఖిల్ విజేతగా నిలువగా గౌతమ్ కృష్ణ రన్నర్ గా నిలిచారు. ఇలా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అయింది. అయితే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుందని తెలుస్తుంది.

ఇక ఈ కార్యక్రమ గ్రాండ్ ఫినాలేలో భాగంగా ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరైన సంగతి తెలిసిందే. రాంచరణ్ తేజ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్ కి ట్రోఫీ అందజేశారు. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే భారీస్థాయిలో వ్యూస్ దక్కాయి. స్టార్ మా ఛానెల్‍తో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని బిగ్‍బాస్ తెలుగు హోస్ట్, కింగ్ నాగార్జున వెల్లడించారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీవీల్లో ఈ గ్రాండ్ ఫినాలేను 23 మిలియన్ (2.3 కోట్లు) మంది ప్రేక్షకులు చూశారు. డిజిటల్ ప్లాట్‍ఫామ్‍లో ఈ ఫినాలేకు 2 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వ్యూస్ లెక్కలతో మ్యాసివ్ ఫెనామిన్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక ఈ సీజన్ ప్రసార సమయంలో ఈ కార్యక్రమానికి అనుకున్నంత స్థాయిలో ఆదరణ అయితే లభించలేదని చెప్పాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. దీంతో రేటింగ్ కూడా భారీగానే తగ్గిందని చెప్పాలి కానీ గ్రాండ్ ఫినాలే కి మాత్రం ఊహించని విధంగా అద్భుతమైన రేటింగ్ రావడం విశేషం.