బన్నీ సినిమాకి వెళ్తే వరుణ్ ధావన్ సినిమా చూపించారు.. అవాక్కైన ప్రేక్షకులు!

డిసెంబర్ ఐదు న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 సినిమా సృష్టిస్తున్న సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు ఇప్పటికే 1700 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి ఒకటో స్థానంలో ఉన్న బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉంది ఈ సినిమా. అయితే ఈ మధ్యనే ఈ సినిమాకి చూడటానికి వెళ్ళిన కొందరికి ప్రేక్షకులకు ఒక సినిమా థియేటర్ గట్టి షాక్ నే ఇచ్చింది. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

జైపూర్ లో పుష్ప 2 సినిమా విడుదలైన దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. అదే సమయంలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరుణ్ ధావన్ సినిమా బేబీ జాన్ విడుదల అయింది. అయితే పుష్ప సినిమా హవాకి వరుణ్ ధావన్ సినిమా ఎవరు చూడటం లేదని అనుకున్నారో ఏమో థియేటర్ యాజమాన్యం. పుష్ప 2 సినిమా పేరు చెప్పి వరుణ్ ధావన్ సినిమా చూపించారు.

మార్నింగ్ సినిమా చూడటానికి అని వచ్చిన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి కూర్చున్న తర్వాత పుష్ప 2 కాకుండా బేబీ జాన్ సినిమా చూపించడంతో అవాక్కవటం ప్రేక్షకుల వంతు అయింది. టికెట్స్ క్యాన్సిల్ చేయకుండా రిఫండ్ ఇవ్వకుండా ఇలా వేరే సినిమా చూపించడం కరెక్ట్ కాదని థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటికి వచ్చేసారు. అయితే థియేటర్ యాజమాన్యం మాత్రం ప్రేక్షకుల గురించి స్పందిస్తూ తమ చేతులలో ఏమీ లేదని సినిమాలు మార్చడం అనేది నిర్మాతల నిర్ణయం అని చెప్పుకొచ్చింది.

అయితే బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసినప్పుడు సినిమా పుష్ప 2 కే బుక్ చేసుకున్నట్లు కానీ థియేటర్ కి వచ్చేసరికి బేబీ జాన్ సినిమా ఉండటం ప్రేక్షకులు సినిమా మారుస్తున్నట్లు కనీసం తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాపోయారు. మరికొందరు మాత్రం ఏ సినిమా అయితే ఏమీ అంటూ బేబీ జాన్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ మేటర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.