AP: ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తులు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే క్యాబినెట్లో కొత్తవారికి చోటు కల్పిస్తూ పనితీరు సరిగ్గా లేనటువంటి కొంతమందిని క్యాబినెట్ నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరును గుర్తిస్తూ వారికి ర్యాంకులు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే 6 నెలల పాలనలో మంత్రుల వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి ఈయన తొలగించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలోనే మరో ఇద్దరు కొత్తవారికి చోటు కల్పించబోతున్నట్టు సమాచారం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కం మంత్రి వాసంశెట్టి శుభాష్, అలాగే విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కం మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ ఈ ఇద్దరినీ క్యాబినెట్ నుంచి తొలగిస్తూ మరో ఇద్దరికి అవకాశం కల్పించబోతున్నారని తెలుస్తుంది.
ఇందులో మొదటగా మెగా బ్రదర్ నాగబాబు పేరును గత 15 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా జనసేన నుంచి నాగబాబుకు ఒక మంత్రి పదవి ఇవ్వగా మరొక మంత్రి పదవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ కి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని చెబుతున్నారు.
ఇలా ఈ ఇద్దరికీ మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యాయని తెలుస్తుంది ఇక వీరి చేత జనవరి 8వ తేదీ మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేయించబోతున్నట్లు సమాచారం ఇక ఈ ఇద్దరు నేతలకు సంక్రాంతి పండుగ జనవరి 8వ తేదీనే రాబోతుందని తెలుస్తోంది.