YS Jagan: సినిమాల విషయంలో జగనే కరెక్టా.. నిరూపించిన రేవంత్ రెడ్డి?

YS Jagan: సినిమాల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటూ తాజాగా రేవంత్ రెడ్డి కూడా నిరూపించారని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్ల ధరలు ఒక సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా సినిమాలకు ఎలాంటి బెనిఫిట్ షోలు కూడా ఇవ్వలేదు. ఇలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి అందుకనే ఇలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి అనుమతి తెలుపలేదు.

ఇలా జగన్ సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయం దూర దృష్టితో ఆలోచించి తీసుకున్నదే కానీ సినిమా సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో తప్పుపట్టారు. జగన్ సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మీడియా సమావేశాలలోను సోషల్ మీడియా వేదికగా కూడా జగన్ పై విషం చిమ్మారు. ఇలా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఎన్నికలలో వైయస్ జగన్ ఓటమి పాలు కావడానికి సినిమా ఇండస్ట్రీ కూడా ఒక కారణమే అని చెప్పాలి.

ఇకపోతే కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి చాలా అనుకూలంగా మారాయి టికెట్ ధరలను భారీగా పెంచుకోవడానికి అనుమతులు తెలిపాయి. అదే విధంగా బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు తెలపడంతో నిర్మాతలు ఎంతో సంతోష పడటమే కాకుండా భారీ లాభాలను కూడా అందుకుంటున్నారు కానీ ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు టికెట్ల రేట్లు పెంచాను అదేవిధంగా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇవ్వనని ఇటీవల సినిమా సెలబ్రిటీల భేటీలో తేల్చి చెప్పారు..

ఈ విధంగా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే నిర్ణయమే కదా తీసుకున్నారు అప్పుడు మాత్రం ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు అయితే జగన్ నిర్ణయమే కరెక్ట్ అని తాజాగా రేవంత్ కూడా నిరూపించారు. సినిమాల విషయంలో జగన్ సరైన నిర్ణయమే తీసుకున్నారంటూ ప్రేక్షకులు అభిమానులు కూడా రేవంత్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.