Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన విధులలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్లిన ఆయనని ప్రజలు ఎవరూ కూడా ఒక రాజకీయ నాయకుడిగాను డిప్యూటీ సీఎం గాను భావించలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తనని ఒక సినీ నటుడిగా మాత్రమే ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఆయన పార్టీ కార్యకలాపాల నిమిత్తం ఎక్కడికి వెళ్లినా సినిమాల గురించి అప్డేట్స్ అడుగుతున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వైకాపా నాయకులు ఎంపీడీవో జోహార్ బాబు పై దాడి చేయడంతో ఈయన ప్రస్తుతం కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎంపీడీవో జోహార్ బాబును పరామర్శించడం కోసం కడప రిమ్స్ వెళ్లారు.
ఈ విధంగా కడప రిమ్స్ హాస్పిటల్ లో జవహర్ బాబును పరామర్శించిన ఈయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ సమయంలో అభిమానులు పెద్ద ఎత్తు ఓజీ… ఓజీ అంటూ నినాదాలు చేశారు దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటయ్యా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలీదు.. పక్కకు రండి అంటూ అభిమానుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తీవ్ర స్థాయిలో అసహనం కూడా వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ కు ఇలా జరగడం మొదటిసారి కాదు గతంలో కూడా ఈయన ఏ ప్రాంతానికి వెళ్లిన మీసం తిప్పండి తొడ కొట్టండి అంటూ అభిమానులు కేకలు వేయడమే కాకుండా సినిమాల అప్డేట్స్ ఇవ్వాలి అని కోరడంతో పవన్ పలు సందర్భాలలో అభిమానుల తీరును పూర్తిగా తప్పు పడుతూ వచ్చారు.. తాజాగా మరోసారి కూడా అభిమానుల తీరుపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు.