అచ్చం అమ్మలాగే.. వైరల్ అవుతున్న అలియా భట్ దంపతుల కుమార్తె రహ!

డిసెంబర్ 25న మతాలతో సంబంధం లేకుండా చాలామంది సినీ సెలబ్రిటీస్ క్రిస్మస్ వేడుకని ఘనంగా జరుపుకున్నారు. అలాగే బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ కూడా తమ కుమార్తె రహ తో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కారణం ఏమిటంటే అలియా భట్ దంపతుల గారాల పట్టి రాహా ఫోటోగ్రాఫర్స్ వైపు చేతులు ఊపుతూ వారికి ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ కనిపించింది ఈ స్టార్ కిడ్.

గత సంవత్సరం క్రిస్మస్ రోజు తమ గారాల బట్టిని ప్రపంచానికి పరిచయం చేశారు రణబీర్ దంపతులు. ప్రస్తుతం ఆమె అందర్నీ పలకరించే విధానం చూసి అప్పుడే ఎంత పెద్దది అయిపోయింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే పలకరించడంలో అమ్మానాన్నలని మించిపోయింది అంటూ ఈ క్యూటెస్ట్ కిడ్ ని తెగ పొగిడేస్తున్నారు. ఆమె అందరినీ పలకరించటం ఫ్లైయింగ్ కిస్ ఇవ్వటం, చెయ్యి ఊపుతున్న ఫోటోలు ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రహా అప్పుడే స్టార్ అయిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈమె బుల్లి సెలబ్రిటీ అయిపోయింది, ఆమెను క్లిక్ చేసేందుకు కెమెరామెన్లు పోటీ పడుతున్నారు. వారు హాయ్ చెప్తే రాహ హాయ్ చెప్తుంది. ఫ్లయింగ్ కిస్సులతో అందరినీ నవ్వించేస్తోంది. చాలామంది సెలబ్రిటీలు బిడ్డలని ఫోటోలు తీసేందుకు అంగీకరించరు. తమ పిల్లల ఫోటోలు తీయొద్దు అంటూ ఫోటోగ్రాఫర్లపై కోప్పడతారు చాలామంది సెలబ్రిటీస్.

కానీ అలియా భట్ రణబీర్ కపూర్ దంపతులు మాత్రం రహా ను కెమెరాకు అలవాటు చేస్తున్నారు. ఆమె కూడా ఇప్పటినుంచే సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తల్లి అలియా ఎలాగైతే ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తుంటుందో అచ్చం అలాగే రహ కూడా ఫ్లైయింగ్ కిస్ లు ఇవ్వడంతో అది చూసిన అలియా తెగ నవ్వేస్తోంది. తను ఒక స్టార్ కిడ్ అని తనకి తెలిసిపోయినట్లు ఉంది అంటూ అలియా, రణబీర్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.