Coconut Milk: కొబ్బరి పాలతో తయారుచేసిన టీ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!

Coconut Milk: కొబ్బరికాయ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభించి శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి. అయితే కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి నుండి తయారు చేసిన పాలతో టీ తయారు చేసి తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి టీ తాగటం వల్ల కలిగే ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.

కొబ్బరి పాలను తయారు చేయటానికి కొబ్బరిని బాగా మెత్తగా పేస్ట్ చేసి దాని నుండి పాలు తీస్తారు. కొబ్బరి టీ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో నీళ్లు బాగా మరిగించి అందులో మూడు టీ బ్యాగ్లు వేయాలి.కొంత సమయం తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలు పోసి అందులో కొంచెం బ్రౌన్ షుగర్, క్రీం వేసి బాగా కలిపి టీ బ్యాగ్స్ తీసేసి తాగాలి. తరచూ ఇలా తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

కొబ్బరి పాలల్లో లారిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు కొబ్బరి పాలల్లో అధికంగా ఉంటాయి. గ్రీన్ టీతో కలిపి కొబ్బరి పాలతో టీ చేసి తాగటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించవచ్చు.

ఈ టీ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. తద్వారా అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. బీపీ సమస్యతో బాధపడేవారు ఈ టీ తాగటం వల్ల వారి సమస్య తగ్గుముఖం పడుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు.