కర్పూరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే. మన వంటల్లో పచ్చ కర్పూరాన్ని సైతం ఎక్కువగా వినియోగిస్తారు. దైవ పూజలలోనూ, ప్రసాదాలలోనూ ఈ కర్పూరాన్ని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో కర్పూర చెట్ల నుండి ఈ కర్పూరం తయారవుతుంది. కర్పూరం ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తుందని చెప్పవచ్చు.
కర్పూరాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావించవచ్చు. పచ్చ కర్పూరం ఉపయోగించిన ప్రదేశం చాలా ప్రశాంతంగా, మనసుకు హాయిని ఇస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఆహారాన్ని ఎక్కువకాలం తాజాగా ఉంచడంలో ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. ఆరోగ్య పరంగా పచ్చ కర్పూరం చాలా గొప్ప లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న సమయంలో పచ్చ కర్పూరం వాడితే మంచిదని చెప్పవచ్చు.
వంటల్లో పచ్చ కర్పూరాన్ని పరిమితంగా వాడితే మంచిది. పచ్చ కర్పూరంను ఎక్కువగా వాడితే మాత్రం వాంతులు, మైకం, మూర్చలు లాంటి సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. ఔషదాల తయారీ కోసం, సౌందర్య సాధనాల కోసం ఉపయోగించే కర్పూరాన్ని వంటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వంటకాలను తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
వంటలు తినేవాళ్లు పచ్చ కర్పూరం విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పచ్చ కర్పూరం వల్ల ఏ స్థాయిలో బెనిఫిట్స్ ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పచ్చ కర్పూరంకు సంబంధించి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.