Mechanic Rocky Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ఈ రోజు అనగా శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మా ఈ తెలుగు రాజ్యం న్యూస్ ఛానల్ తరుపున మెకానిక్ రాకీ సినిమా రివ్యూ మరియు రేటింగ్.
(సినిమా: మెకానిక్ రాకీ, తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్)
(సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి, నిర్మాత: రామ్ తాళ్లూరి, ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ , సంగీతం: జేక్స్ బిజోయ్, డీవోపీ: మనోజ్ కటసాని, ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం, ఎడిటర్: అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె, పీఆర్వో: వంశీ-శేఖర్)
Mechanic Rocky: ‘మెకానిక్ ఆడియన్స్ ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు: హీరో విశ్వక్ సేన్
ముందుగా కథ విషయానికి వస్తే: నగుమోము రాకేష్ అలియాస్ మెకానిక్ రాకీ (Vishwak Sen) బీటెక్‌ను మధ్యలోనే ఆపేస్తాడు రాకీ, అందువలన సరిగ్గా రాకీ చదవట్లేదు అని భావించిన అతని తండ్రి(నరేష్) తన మెకానిక్ షెడ్డులో పనికి పెట్టేస్తాడు ఆ తర్వాత అతను పేరు కాంచిన మెకానిక్ గా ఉన్నాడు. అలాగే తన మెకానిక్ షెడ్డులో డ్రైవింగ్ క్లాసులు పెడుతూ ఉంటాడు ఇలాంటి టైంలో రాకీ డ్రైవింగ్ స్కూల్ లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయ(Shraddha Srinath) వస్తుంది ఆమె ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. ఆమెకు డ్రైవింగ్ నేర్పించే క్రమంలో తన ప్రేమ కథ గురించి, కెరీర్ గురించి చెబుతాడు రాకీ. బాగా పలుకుబడి ఉన్నఅక్కి రెడ్డి(Suneel) అనే రౌడీ ఆక్రమించుకోవాలని చూస్తాడు ఆ స్థలం అమ్మాలని రాకీ తండ్రిపై ఒత్తిడి తీసుకొస్తాడు.
Mechanic Rocky: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ అక్టోబర్ 20న ట్రైలర్ లాంచ్
తర్వాత రాకీ తండ్రి మరణించాడు అని తెలుసుకుని షెడ్డుని తన పలుకుబడి ఉపయోగించి సీజ్ చేస్తాడు. ఈ క్రమంలో తన షెడ్డు కోసం అక్కి రెడ్డితో ఓ డీల్ కుదుర్చుకుంటాడు రాకీ. తండ్రి గుర్తుగా తన షెడ్డు కావాలని భావించి .. రూ.50 లక్షలు ఇస్తాను అని చెబుతాడు. కానీ అతనికి డబ్బులు అడ్జస్ట్ కావు. ఈ క్రమంలో మాయ.. రాకీ తండ్రి పేరుపై రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అని చెబుతుంది. సైబర్ క్రైమ్, ఇన్సూరెన్స్ మోసాలు అనే కథకు లవ్‌స్టోరీని, కామెడీని డైరెక్టర్ ముళ్లపూడి రవితేజ ఈ కథను రాసుకున్నాడు. తన లవర్ ప్రియా(Meenakshi Chaudhary) మెకానిక్ రాకీకి చేసిన సాయం ఏంటి? మెకానిక్ రాకీ గతం? అనేది మిగతా మూవీ కథ.
Mechanic Rocky: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ నుంచి రామ్ మిరియాల పాడిన ‘ఐ హేట్ యూ మై డాడీ’ సాంగ్ రిలీజ్
ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్ :
సెకండాఫ్
ట్విస్టులు
సరికొత్త పాయింట్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్
మద్య మద్యలో ఫోర్స్డ్ కామెడీ
రేటింగ్: 2.5/5 స్టార్స్…