మైసూర్ లో ప్రారంభమైన ఆర్ సి 16 ఫస్ట్ షెడ్యూల్.. బుచ్చిబాబు ప్లానింగ్ మామూలుగా లేదుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని జనవరి 10వ తారీఖున రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉంది. మరోవైపు రాంచరణ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్ సి 16 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రేటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పై వెంకట సతీష్ కిలారు ఆర్ సి 16 ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్ పోషించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో ప్రారంభించేందుకు ఏర్పాటులో జరుగుతున్నాయి. రామ్ చరణ్ తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్ స్టాప్ గా 15 రోజులు పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మైసూర్ లోని చాముండి మాతను దర్శించుకున్న బుచ్చిబాబు ఆమె పాదాల చెంత స్క్రిప్ట్ ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. మొదటి షెడ్యూల్ మైసూరులో జరిగితే రెండవ షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతుందని సమాచారం.ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడుగా నటిస్తున్నాడు. స్పోర్ట్స్ మెన్ లా కనిపించడం కోసం కోచ్ శివోహం బట్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.

గత సినిమాలకు భిన్నంగా లార్జెర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపిస్తాడని, ఉప్పెనకు మించి రామ్ చరణ్ సినిమా రా అండ్ రస్టిక్ గా ఉంటుందని అంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు ఫ్యాన్ ఇండియా స్టార్స్ తో పాటు దేశంలోనే టాప్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.