ప్రస్తుత కాలంలో చాలామందిని చిన్న వయస్సులోనే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్, ఒంటి నొప్పులు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే శరీరానికి ఉప్పు నీటి స్నానం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉప్పు నీటిలోని పోషకాలు చర్మంపై ఉండే మృత కణాలను తొలగించడంలో తోడ్పడతాయి.
చర్మవ్యాధులైన ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా సాల్ట్ వాటర్ బాత్ ను ట్రై చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఉప్పు నీటితో స్నానం వల్ల కీళ్ల వద్ద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఉప్పు నీటి స్నానం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కండరాలు, కీళ్లు, శరీరంలోని వివిధ భాగాల్లో తీవ్ర నొప్పులు వస్తున్న వాళ్లకు ఉప్పునీటి స్నానం మేలు చేస్తుంది.
కండరాల నొప్పుల నుంచి బయటపడాలంటే ఉప్పు నీటి స్నానం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ స్నానం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. అయితే ఉప్పునీటితో హెడ్ బాత్ చేయడం మాత్రం మంచిది కాదు. మరోవపు చలికాలంలో కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. అస్తమా, సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డీసీజ్), అలర్జీ, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు చాలామందిని వేధిస్తోంది.
చలికాలంలో ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. చలికాలం ఆరోగ్యం విషయంలో ఎలాంటి పొరపాట్లు చేసినా దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.