విక్టరీ వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి తీస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో వెంకటేష్ పాత్రతో పాటు ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయని వారి మధ్య జరిగే కథతో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ లభించడం ఖాయమని అంటున్నారు మూవీ మేకర్స్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై నిర్మిస్తున్నఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మీటింగ్ లో జనవరి 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీకి బీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కాబోతుందని సమాచారం. ఈ ఈవెంట్ లో వెంకటేష్ లుంగీ నల్లచొక్కా ధరించి అద్భుతమైన మాస్ లుక్ లో కనిపించారు.
వెంకటేష్ మాట్లాడుతూ అనిల్ రావిపూడి తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉందని, ఈ సినిమాతో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారని, ఇది నా కెరియర్ లోనే బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని డెఫినెట్ గా ఈ సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ చేశారు. తమ్మి రాజు ఎడిటర్ బాధ్యతలు చేపట్టగా వెంకట్ యాక్షన్ సన్నివేశాలని కొరియోగ్రఫీ చేశారు.
అలాగే దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమాతో పాటు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలని కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నాము అన్ని పెద్ద విజయాలని సాధించబోతున్నాయని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ అందరినీ నవ్వించడం కోసం చేసిన సినిమా ఇది, క్లైమాక్స్ వన్ మ్యాన్ షోలా అందరూ ఆస్వాదించేలా ఉంటుంది. ప్రేక్షకులకు అసలు సిసలైన సంబరం ఈసారి సంక్రాంతి పండుగ అన్నారు.