ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని మెడనొప్పి సమస్య వేధిస్తోంది. మెడనొప్పి సమస్య చిన్న సమస్యే అయినా ఈ సమస్య వల్ల పడే ఇబ్బంది అంతాఇంతా కాదు. వెన్నెముకను సరైన భంగిమలో ఉంచని పక్షంలో మెడనొప్పి వస్తుందని చెప్పవచ్చు. సరైన భంగిమలో కూర్చోని వాళ్లను సైతం మెడనొప్పి సమస్య వస్తుంది.
తరచూ స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్లను ఉపయోగించే వాళ్లు సైతం ఈ సమస్యతో బాధ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెడపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా మెడ నొప్పి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వర్క్ చేసే వాళ్లు కూర్చునే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మెడను అటూఇటూ కదపడం ద్వారా మెడ నొప్పిని తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రివర్స్ ఫోల్డర్ స్ట్రెచ్ చేయడం ద్వారా ఛాతీ, భుజం సాగదీసే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న వ్యాయామాలను చేయడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మెడ నొప్పి ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే మాత్రం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఐస్ ప్యాక్ సహాయంతో కూడా మెడ నొప్పికి చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. మెడను నెమ్మదిగా మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగించడం ద్వారా మెడనొప్పిని నివారించే అవకాశాలు ఉంటాయి. యోగా చేయడం ద్వారా కూడా మెడ నొప్పికి చెక్ పెట్టవచ్చు. ఆక్యుపంక్చర్ థెరపీ ద్వారా మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చే మెడ నొప్పికి చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.