AP Politics: రోజా అవినీతి తిమింగలం.. ఆమెను కచ్చితంగా జైలుకు పంపిస్తాం.. శాప్ చైర్మన్ రవి నాయుడు?

AP Politics: ప్రస్తుత శాప్ చైర్మన్ రవి నాయుడు గత ప్రభుత్వ హయామంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆర్కే రోజా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయామంలో ఆడదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రోజా కొన్ని వందల కోట్ల స్కాం చేశారని రవి నాయుడు తెలిపారు.

ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా వేల కోట్లను దుర్వినియోగం చేశారని ఈయన ఫైర్ అయ్యారు. కేవలం ఎన్నికలలో ఓట్లు పొందడం కోసమే 17 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో వారికి క్రీడల్లో అవకాశం కల్పిస్తూ కిట్లను పంపిణీ చేశారని తెలిపారు.ఇక క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్క చిన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని ఫైరయ్యారు.

ఇక రోజా టూరిజం శాఖ మంత్రి అయినంత మాత్రాన ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వందల మందికి ఈమె దర్శనం చేయిస్తారా? తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఇలా ఈ రెండు అంశాల ద్వారా రోజా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు .ఆమె అవినీతి తిమింగళమని రవి నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, ఆ తిమింగలం చేత అవినీతిని మొత్తం కక్కిస్తామనీ, రోజాని కచ్చితంగా జైలుకు పంపిస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు రోజా గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక ఈయన చేసిన వ్యాఖ్యలపై పలువురు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి తిమింగలాలు లేరా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు అవినీతి చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని తప్పనిసరిగా విచారణ చేయించాల్సిందే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.