మనలో చాలామంది టీ బిస్కెట్ లను ఎంతో ఇష్టంగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. టీ బిస్కెట్లను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా బిస్కెట్ల తయారీలో చాలా మంది ప్రధానంగా మైదా పిండిని వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. మైదా తినడం వల్ల శరీరానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది.
మైదా బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరుగుదల, గుండె జబ్బులు, అజీర్ణం, గుండెల్లో మంట ఇతర సమస్యలకు కారణమవుతుంది. బిస్కెట్ల తయారీ కోసం పామాయిల్ ను ఎక్కువగా వినియోగిస్తారు. పామాయిల్ తో తయారైన బిస్కెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు తగ్గడంతో పాటు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు అయితే పెరుగుతాయని చెప్పవచ్చు.
రోజూ బిస్కెట్లను తీసుకుంటే రక్తపోటు పెరగడం, స్ట్రోక్ వంటి ప్రమాదాలు, గుండె జబ్బుల ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బిస్కెట్ల తయారీలో ముందుగానే కొన్ని రసాయనాలను ఎక్కువ కాలం బిస్కెట్లు నిల్వ ఉండడం కోసం ఉపయోగిస్తారు. బిస్కెట్ల కోసం వాడే బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీనిసోల్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోలున్ కెమికల్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
టీ బిస్కెట్లకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. టీ బిస్కెట్ రెగ్యులర్ గా తీసుకునే అలవాటు ఉన్నవాళ్లు ఈ అలవాటును మార్చుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. టీ బిస్కెట్లకు అడిక్ట్ కావడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.