Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తన ప్రవచన కార్యక్రమాలలో భాగంగా కొన్నిసార్లు సినిమా వాళ్లకు సంబంధించిన విషయాల గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఉంటారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల గురించి గరికపాటి చేసే వ్యాఖ్యలు ఆయనని వివాదంలోకి తోసేస్తున్నాయి.
గత కొద్ది రోజుల క్రిందట చిరంజీవితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన చిరంజీవిపై విమర్శలు చేశారు. కొంతమంది చిరంజీవితో ఫోటోలు తీసుకోవడం కోసం రావడంతో ఇలా సెల్ఫీలు దిగుతూ అక్కడే ఉంటే కుదరదు ఇలాగైతే నేను వెళ్ళిపోతాను అంటూ మాట్లాడటంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇకపోతే తాజాగా మరోసారి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి గరికపాటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.స్మగ్లింగ్ వాళ్లను హీరోల్లా చేశారని.. అన్నారు. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గెదెలా అంటాడా.. కుర్రాళ్లు ఇటీవల తగ్గెదెలా అంటున్నారు.. ఈ డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోయాయన్నారు. ఈ మూవీ డైరెక్టర్ ను, అల్లు అర్జున్ ను కడిగేస్తానంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి డైలాగులు ద్వారా పిల్లలు కూడా చెడిపోతున్నారని తెలిపారు. సత్య హరిశ్చంద్రుడు.. శ్రీరాముడు లాంటి వారు మంచి పనులు చేస్తారు.. వారు అలాంటి వ్యాఖ్యలు చేసిన దానికి ఒక అందముంటుంది. తొక్కలో స్మగ్లర్ ఈ డైలాగ్ లు వాడటమేంటని ఈయన మండి పడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఒక సినిమాని ఎప్పుడు కూడా సినిమాలాగే చూడాలి అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.
Trending now! #Pushpa2 #GarikipatiNarasimhaRao pic.twitter.com/dQGWJqYjAu
— Manmohan Miryala (@MiryalaManmohan) November 21, 2024