AP Politics: ఏపీలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నటువంటి శాంతిభద్రతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు అధికారనేతలన్న, అధికారులన్న ప్రజలలో భయం ఉండేది కానీ ప్రస్తుతం అధికార నేతలు అంటే ఏ మాత్రం భయం లేకుండా పోతుందనే రాజకీయ నాయకులను మంత్రులను ఎమ్మెల్యేలను కూడా సోషల్ మీడియాలో దూషిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
ముఖ్యంగా తల్లి, చెల్లిని ఎస్ఎంఎస్ లో అసభ్యంగా దూషించిన గత ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు సీఎం. ఇప్పటికీ అలాంటి వారిని ఈయన వెనకేసుకొస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటికి కూడా కొంతమంది హోం మంత్రి అనిత డిప్యూటీ సీఎంపై కూడా అనుచిత పోస్టులు చేస్తున్నారని తెలియజేశారు. దళిత మహిళ అయిన హోంమంత్రికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.
రాష్ట్రంలో హోంమంత్రికి రక్షణ లేకుండా పోతే మరి ఎవరికి ఉంటుందని ఈయన ప్రశ్నించారు.కొందరికీ డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయిందన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయామంలో మాదిరిగా ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నటువంటి శాంతి భద్రతల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో చేసే అనుచిత పోస్టుల గురించి ఈ సందర్భంగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక గత ప్రభుత్వ హయామంలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావనకు తీసుకువచ్చారు.