నేడు సమాజంలో వివాహాలు ఎంత త్వరగా అవుతున్నాయో విడాకులు కూడా అంతే త్వరగా అవుతున్నాయి. ఒకవైపు పలువురు స్టార్స్ వివాహ బంధంలోకి అడుగు పెడుతుంటే మరొకవైపు బ్యూటిఫుల్ కపుల్స్ డివోర్స్ అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు.అన్ని రంగాలలో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అందరూ ఎక్కువగా దృష్టి పెట్టేది సినిమా రంగం మీద కాబట్టి వారి గురించిన వివరాలు ఎక్కువగా బయటకు వస్తాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం సహజమే కానీ పెళ్లయి దశాబ్దాలు దాటిన జంటలు కూడా విడాకులు తీసుకోవటం అనేది అందరిని షాక్ కి గురిచేస్తుంది.
రీసెంట్గా సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల బంధానికి పుల్ స్టాప్ పెట్టడంతో మళ్లీ ఈ టాపిక్ తెరమీదకి వచ్చింది. ఏ ఆర్ రెహమాన్ జంట మీదే కాకుండా ఈ సంవత్సరం విడాకులు తీసుకున్న పలువురు సెలబ్రిటీ జంటల గురించి కూడా మళ్లీ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ సంవత్సరంలో ఏ ఏ జంటలు విడాకులు తీసుకున్నాయి మనం కూడా చూద్దాం. ఏడాది ప్రారంభంలోనే మ్యూజిక్ డైరెక్టర్ నటుడు అయిన జీవి ప్రకాష్ కుమార్ తన భార్య సైంధవితో విడిపోతున్నట్లు అనౌన్స్ చేయడంతో అభిమానులు షాక్ గురయ్యారు.
ఈ ఏడది సెప్టెంబర్ లో హీరో జయం రవి తన భార్య ఆర్తీ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే ఈ విషయం తనకి కూడా తెలియదని,ఎలాంటి సమాచారం లేకుండానే రవి విడాకులు తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేశారని ఆయన భార్య ఆర్తి సోషల్ మీడియా ద్వారా స్పందించడం గమనార్హం. ఈ జంట వైవాహిక జీవితం వయసు 15 సంవత్సరాలు. ఇక లేటెస్ట్ గా ఏ ఆర్ రెహమాన్ సంగతి అందరికీ తెలిసిందే. అయితే నార్త్ లో కూడా ఈ విడాకుల ట్రెండ్ జోరుగా నడుస్తుంది.
హీరోయిన్ ఈషా డియోల్ తన భర్త భరత్ నుంచి ఈ సంవత్సరమే విడాకులు తీసుకుంది. అలాగే చంద్రలేఖ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈషా కొప్పికర్ జంట కూడా ఈ సంవత్సరమే విడిపోయింది వీరితోపాటు బాలీవుడ్ ఫేమస్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకారోర కూడా ఈ సంవత్సరమే విడిపోయారు. ఇక వీటితోపాటు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటి కం మోడల్ నటాషా కూడా ఈ ఏడదే విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.