Konda Surekha: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఈమె గత కొద్ది రోజుల క్రితం కేటీఆర్ గురించి మాట్లాడుతూ అక్కినేని కుటుంబాన్ని కూడా ఈ వివాదంలోకి లాగారు. ఇక ఈ విషయం సంచలనంగా మారడమే కాకుండా నాగార్జున ఏకంగా ఈమెపై 100 కోట్ల పరువు నష్టం దావా కేసు కూడా వేసిన సంగతి తెలిసిందే.
కేటీఆర్ కారణంగా నాగచైతన్య సమంత విడిపోయారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా అక్కినేని కుటుంబ సభ్యులకు గురించి కూడా ఈమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కేవలం అక్కినేని కుటుంబం మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ నాగార్జున కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఈ వివాదం ముగియకుండానే మరో వివాదంలో చిక్కుకున్నారు.
కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన బండ బూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరాల ముందు అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలో భాగంగా ఒక యువతితో కొండ సురేఖ మాట్లాడుతూ ఈరోజు మా అందరికీ పెద్ద పండగ బిర్యానీలు తెప్పిస్తున్నాము. మా టీం అంతా ఫుల్ హ్యాపీ బిర్యానీ ఉంటే బీర్ కూడా ఉంటది కదమ్మా. అఫీషియల్ సెలేబ్రేషన్ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది.
ఇగ అన్‌అఫీషియల్‌గా అంటే.. అన్నారు. మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని చెప్తున్నా అన్నారు. బిర్యానీలతో పాటు సల్లవడుడు కూడా నడుస్తున్నది అంటూ ఈ సందర్భంగా కొండ సురేఖ ఈ వీడియోలలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దీంతో ఇంటిపై ఐటి సోదాలు జరపాలి అంటూ పలువురు కొండ సురేఖ వీడియోలను మరింత వైరల్ చేయడంతో ఈమె కాస్త ఇబ్బందులలో పడ్డారని చెప్పాలి.