జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు రాకింగ్ రాకేష్. ఇతను ఈ మధ్యనే కేసీఆర్ సినిమాలో నటించిన విషయం మనకి తెలిసిందే. రాకేష్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా. తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా గత సంవత్సరమే విడుదల కావాల్సి ఉండగా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. అయితే ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఈ నటుడు తన తోటి జబర్దస్త్ కమెడియన్ అయిన జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం తమ జంట ఎన్నో కష్టాలు పడిందని ఇల్లు కార్లు అన్ని తాకట్టు పెట్టామని చెప్పుకొచ్చారు రాకింగ్ రాకేష్ దంపతులు. అయితే ఏ భాషలో అయినా చిన్న సినిమాలను తీయటం పెద్ద కష్టం కాదు కానీ దాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడం, థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పెద్ద టాస్క్.
అందుకే చిన్న సినిమాల మేకర్స్ పబ్లిసిటీ కోసం సర్కస్ ఫీట్ల కంటే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి ప్రమోషన్స్లో భాగంగానే రాకింగ్ రాకేష్ తాజాగా హైదరాబాద్ రోడ్లమీద తిరుగుతూ అర్ధరాత్రి సమయంలో గోడలపై తన సినిమా పోస్టర్లను తానే అతికించుకోవటం జరిగింది. అటుగా వెళుతున్న వారు కొందరు ఆగి మరి రాకేష్ ని చూడటం, ఫోటోలు వీడియోలు తీసుకోవటం చేశారు. సినిమాని జనాల్లోకి తీసుకు వెళ్ళటానికి చాలామంది చాలా రకాలుగా పబ్లిసిటీ స్టన్స్ చేస్తూ ఉంటారు.
రాకేష్ చేసిన ఈ స్టంట్ పెద్దదేమి కాదని ఆయన నిజాయితీగా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు అంటూ ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు కొందరు ప్రేక్షకులు. కొందరు మాత్రం ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా పెట్టేసాడని, ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు అయినా సేవ్ చేద్దామని రాకేష్ ఇలా కష్టపడుతున్నాడంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. సర్వస్వం ఈ సినిమా కోసం ధారబోసిన రాకింగ్ రాకేష్ దంపతులకి ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.