YS Sharmila: నా పిల్లల మీద ప్రమాణం.. ప్రభాస్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు: వైయస్ షర్మిల

YS Sharmila: వైయస్ షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా ఈమె తన అన్నయ్య వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా వీరికి ఆస్తి విభేదాలు ఉండడంతో షర్మిల రాజకీయాల పరంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.

గత ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి పరోక్షంగా వైఎస్ షర్మిల కూడా కారణమని చెప్పాలి ఈమె తన అన్నయ్య గురించి చెడుగా ప్రచారం చేయడమే కాకుండా తన అన్నకు ఓట్లు వేయొద్దు అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇక తన అన్నయ్య ఓడిపోయినప్పటికీ ఈమె పరిపాలన గురించి అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏదో ఒక విషయంలో ఆయన పట్ల విమర్శలు చేస్తూ వచ్చారు.

ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూటమి నేతల గురించి అసభ్యకరంగా పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల కూటమి నేతలకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా వైఎస్ షర్మిల తన అన్నయ్య గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ షర్మిల ప్రభాస్ కి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ వార్తలు గురించి వైఎస్ షర్మిల స్పందిస్తూ నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్న నాకు ప్రభాస్ కి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నేను ఇప్పటివరకు ప్రభాస్ ను నేరుగా చూడలేదని తెలిపారు. జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. నేను అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెబుతున్నాను ప్రభాస్ కి నాకు మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ లేదని తెలిపారు. ఒకవేళ జగన్ కు నా మీద ప్రేమ గౌరవం ఉండి ఉంటే ఒకప్పుడు తన సైకో బ్యాచ్ చేసిన ఈ తప్పుడు వార్తలను ఎందుకు ఖండించలేదు అంటూ షర్మిల ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.