Posani Krishna Murali: సినీ ఇండస్ట్రీలో రచయితగా దర్శకుడిగా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పోసాని కృష్ణ మురళి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఈయన గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి కీలక పదవి తీసుకున్నటువంటి ఈయన అప్పట్లో చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేశారు.
ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వారి గురించి ఎవరైతే విమర్శలు చేశారో వారందరిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది వైకాపా కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు కూడా చేశారు. అయితే మరి కొంతమంది వైకాపా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంచలన తార శ్రీరెడ్డి కూడా సోషల్ మీడియా వేదిక క్షమాపణలు చెబుతూ వీడియోలు చేశారు.
తాజాగా పోసాని కృష్ణ మురళి సైతం వైయస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎంతోమంది రాజకీయ నాయకులను పొగిడాను. వారు మంచి చేసినప్పుడు వారిపై ప్రశంసలు కురిపించాను. తప్పు చేసినప్పుడు విమర్శించానని తెలిపారు. తాను అన్ని పార్టీ నాయకులకు మద్దతు తెలిపానని వెల్లడించారు. ఇక చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను ఓ లిస్టు కూడా తయారు చేశాను. అయితే ఆయన పొరపాటు చేసినప్పుడు విమర్శించానని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ ని కూడా నేను తిట్టాను కానీ వారు నా ఫ్యామిలీ పై ఆరోపణలు చేసినప్పుడే నేను కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టానని పోసాని తెలిపారు. ఇక తాను ఈ రాజకీయాలలో కొనసాగలేనని అందుకే రాజకీయాల పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నా చివరి శ్వాస ఉన్నంతవరకు రాజకీయాలలోకి రానని కేవలం సినిమాలు చేసుకుంటానని తెలిపారు.ఎవరైనా అవకాశం ఇస్తే అది పవన్ సినిమా అయినా చిరు సినిమా అయినా సరే సినిమాలలో నటిస్తా లేదంటే నేనే సినిమాలు చేస్తానని ఈ సందర్భంగా పోసాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.