KCR: తెలంగాణ రాష్ట్రంలో లగచర్ల గ్రామ ఘటన సంచలనంగా మారింది. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు భూసేకరణలో భాగంగా అధికారులు వెళ్లగా అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో భాగంగా పలువురిని పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా ఈ దాడి వెనుక బిఆర్ఎస్ హస్తం ఉంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేశారు.
ఇక ఈ దాడి వెనుక కేటీఆర్ ప్రమేయం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా లగచర్ల గ్రామ దాడి ఘటనలో మొదటిసారి కేసీఆర్ పేరు తెరపైకి వచ్చింది. కోర్టులో కేసీఆర్ పేరు ప్రస్తావించారు ప్రభుత్వ తరపు న్యాయవాది నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఈ విషయం గురించి ప్రభుత్వ తరపు న్యాయవాది కొన్ని కీలకమైన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తుంది.
లగచర్ల దాడి ఘటనలో కేసీఆర్ పేరును ప్రస్తావించడమే కాకుండా స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గ్రామస్తులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినటువంటి వీడియోలకు సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ కూడా కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసమే చేసారు అంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
ఇలా లగచర్ల దాడి ఘటనలో భాగంగా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి తాజాగా కెసిఆర్ ప్రమేయం కూడా ఉందనే విధంగా లాయర్ వ్యాఖ్యలతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య తరచు మాటల యుద్ధం జరుగుతోంది. మరి ప్రభుత్వ తరపు లాయర్ చేసిన ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
లగచర్ల ఘటనలో తొలిసారి కేసీఆర్ పేరు ప్రస్తావన
కోర్టులో కేసీఆర్ పేరు ప్రస్తావించిన ప్రభుత్వ తరపు న్యాయవాది
మాజీ సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చారన్న ప్రభుత్వ తరపు లాయర్
మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ ని హైకోర్టుకు అందజేసిన ప్రభుత్వ తరపు న్యాయవాది నాగేశ్వర రావు… pic.twitter.com/vfwoW8VhFP
— BIG TV Breaking News (@bigtvtelugu) November 22, 2024