Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే .దాదాపు 164 రోజులపాటు ఈమె జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా ఈమె విడుదలయ్యి దాదాపు మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనలేదు అలాగే రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు పూర్తిగా ఈమె తన వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యారు.
ఇలా జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని గైనిక్ సమస్యలను ఎదుర్కొన్నటువంటి కవిత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ కుటుంబంతోనే గడిపారు. అయితే ఈమె తిరిగి రాజకీయాలపై ఫోకస్ చేశారని తెలుస్తుంది. ఈ మూడు నెలల పాటు రాష్ట్ర పరిస్థితిలను పరిశీలించిన కవిత తిరిగి రాష్ట్ర రాజకీయాలలో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.
ఇకపోతే గురువారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది.అదానీ వ్యవహారంపై ఎక్స్ వేదికగా గురువారం ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అని మండిపడ్డారు. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని ప్రధానిని నిలదీయడం మాత్రం కష్టం అంటూ ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, బీఆర్ఎస్ నేతలపై మోపుతున్న కేసులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం, రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా నిధులు విషయం గురించి ఈమె ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే కవిత జనంలోకి రాబోతున్నట్టు సమాచారం.ఒక వైపు సోషల్ మీడియా, మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని, కేడర్ తోనూ సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తుంది.