మనలో చాలామంది పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పిల్లలకు ఏ చిన్న కష్టం కలగకుండా ఉండాలని తల్లీదండ్రులు భావిస్తారు. పిల్లలకు దిష్టి దోషాలు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని తొలగించవచ్చు. కొంతమంది పిల్లలు తరచూ జ్వరం రావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మరి కొందరు పిల్లలు నిద్రలో ఉలిక్కిపడటం జరుగుతూ ఉంటుంది.
ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉంటారు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలను గమనిస్తే మాత్రం దిష్టి దోషాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. గ్రహ బాధల వల్ల కూడా పిల్లలు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఉప్పు, మిరపకాయలు, బెల్లం తీసుకుని పిల్లలకు పై నుంచి కింది వరకు దిష్టి తీయడం ద్వారా దిష్టి దోషాలను తొలగించే అవకాశం అయితే ఉంటుంది.
ఏడుసార్లు దిష్టి తీసిన తర్వాత మూడు రోడ్లు కలిసిన చోట పక్కన దిష్టి తీసిన వాటిని పడేయాలి. శనివారం రోజున దిష్టి తీస్తే ఆ బెల్లాన్ని నల్ల కుక్కకు తినిపించాలి. ఆది, సోమవారాల్లో దిష్టి తీస్తే ఆవుకు బెల్లాన్ని పెట్టాల్సి ఉంటుంది. మంగళవారం రోజు తీస్తే కుక్కకు మిగతా రోజుల్లో మూడు రోడ్లు ఉన్న ప్లేస్ లో పెట్టవచ్చు. బెల్లం ఉపయోగించడం ఇష్టం లేని వారు లడ్డూను ఉపయోగించవచ్చు.
ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత పిల్లలకు స్నానం చేయిస్తే దిష్టి పోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా పిల్లల ముఖంలో కళ కూడా ఉంటుంది. దిష్టి దోషాలు పిల్లలకు ఉంటే ఈ విధంగా చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.