చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన మ్యాడ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ పేరుతో సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2022లో విడుదలైన తొలి భాగం కేవలం 2.50 కోట్ల బిజినెస్‌తో ప్రారంభమై 9.60 కోట్ల వరకు షేర్ సాధించడమే కాదు, యూత్ ఆడియన్స్‌ను బాగా ఎట్రాక్ట్ చేసింది. దీంతో మేకర్స్ మళ్లీ అదే ఫ్రెష్ ఎనర్జీతో సీక్వెల్‌ను సమ్మర్ టార్గెట్‌గా రూపొందించారు.
ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మ్యాడ్ స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ₹21 కోట్లు. నైజాంలో ₹6.5 కోట్లు, ఆంధ్రాలో ₹7 కోట్లు, సీడెడ్‌లో ₹2 కోట్లు బిజినెస్ జరగగా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ₹3.5 కోట్ల వరకు బిజినెస్ చేసింది. మొదటి భాగం నుండి ఎనిమిదింతలుగా ఈ రేంజ్‌కు చేరడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
ఈ భారీ బిజినెస్‌కు కారణాలు రెండు. ఒకటి, మ్యాడ్ ఫస్ట్ పార్ట్‌కు వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ క్రేజ్. రెండోది, సమ్మర్ హాలిడేలు. పాజిటివ్ టాక్ వస్తే మరింత లాభాల బాటలో ఈ సినిమా పరుగులు తీయడం ఖాయం. ముఖ్యంగా యూత్, కాలేజ్ కిడ్స్ టార్గెట్‌గా ఉన్న ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మల్టీప్లెక్స్ ఓపెనింగ్స్ బలంగా ఉండే అవకాశం ఉంది.
అయితే మ్యాడ్ స్క్వేర్ హిట్ అవ్వాలంటే కనీసం ₹22 కోట్ల షేర్ సాధించాల్సిన అవసరం ఉంది. నితిన్ ‘రాబిన్ హుడ్’, మోహన్‌లాల్ ‘ఎల్ప్ 2 ఎంపురాన్’ లాంటి సినిమాలు కూడా బరిలో ఉండటంతో పోటీ మాత్రం తక్కువ కాదు. కానీ యూత్‌లో మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తే మ్యాడ్ మాయ మళ్ళీ రిపీట్ కావచ్చు.