గుండె సమస్యలు ఉన్నవాళ్లు చేయకూడని తప్పులివే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. గుండె సమస్యలు అనేవి చాలా సాధారణంగా, ప్రాణాంతకంగా కూడా ఉండవచ్చు. గుండె జబ్బులకు గుండెపోటు, గుండె వైఫల్యం, అరిథ్మియా (క్రమరహిత హృదయ స్పందన) మరియు ఇతర సమస్యలు ఉన్నాయి. గుండె జబ్బులకు అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం మరియు ఊబకాయం వంటివి ప్రమాద కారకాలు.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో గట్టిపడటం లేదా మచ్చలు ఏర్పడటం కరోనరీ ఆర్టరీ వ్యాధి లక్షణం అని చెప్పవచ్చు. గుండె కండరానికి రక్త సరఫరా నిలిచిపోవడంను గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) వ్యాధిగా పిలుస్తారు. గుండె తగినంత రక్తాన్ని శరీరానికి పంప్ చేయలేకపోవడం గుండె వైఫల్యంకు సంబంధించిన లక్షణం అని చెప్పవచ్చు.

గుండె లయలో అసమతుల్యతను అరిథ్మియా (క్రమరహిత హృదయ స్పందన)గా చెబుతుండటం గమనార్హం. గుండె కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కవాటాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, గుండె దడ, అలసట, మైకము, మూర్ఛ, కాలి లేదా పొత్తికడుపు వాపు, అసాధారణ చెమట గుండె సమస్యకు కారణమని చెప్పవచ్చు.

అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి, కుటుంబ చరిత్ర గుండె జబ్బులకు ప్రమాద కారకాలు అని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని రెగ్యులర్ వ్యాయామం చేయడంతో పాటు ధూమపానంకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బరువు కంట్రోల్ లో ఉంచుకుంటూ తరచూ వైద్యుడిని సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.