Vironika: మంచు ఫ్యామిలీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలు కాస్త రోడ్డున పడటంతో ఏదో ఒక విషయం ద్వారా వార్తలో నిలుస్తున్నారు. ఇలా బహిరంగంగానే ఒకరిపై మరొకరు కొట్టుకోవడం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం వంటివి జరిగాయి. అయితే ఈ గొడవల గురించి తాజాగా మంచు విష్ణు భార్య విరోనిక రెడ్డి స్పందించారు.
సాధారణంగా విరోనిక ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఆమె ఇంటర్వ్యూలలో పాల్గొనడం కూడా చాలా తక్కువ అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. అదేవిధంగా తన ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి కూడా స్పందించారు. కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవలు ఉండటం సర్వసాధారణం అయితే ఆ గొడవలు బయటకు రావు కానీ దురదృష్టవశాత్తు మా కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయని అవి బయటపడటం బాధాకరమని తెలిపారు.
ఇలా ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో నా పిల్లలు ఎక్కువ భయపడిపోతున్నారు ఈ గొడవ వారిపై చాలా ప్రభావం చూపుతుదని విరోనికా తెలిపారు అందుకే పిల్లలను ఇలాంటి గొడవలకు పూర్తిగా దూరంగా ఉంచుతున్నానని ఈమె తెలియజేశారు నాకు అన్నింటికంటే పిల్లలే ముఖ్యం వారికోసం ఒక స్పాంజిలా ఎన్ని సవాళ్లు అయినా ఓపికగా భరిస్తాను. పిల్లలు ఇలాంటి వాటికి ప్రభావం కాకుండా ఉండాలి అంటే నేను కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు..
ఇలా కుటుంబ గొడవలు గురించి విరోనికా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదేవిధంగా ఈ దంపతులకు నలుగురు సంతానం అనే సంగతి తెలిసిందే. ఇలా తాను నాలుగోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పుడు చాలామంది మాపై ట్రోల్స్ చేశారు మీకేం పని పాట లేదా అంటూ విమర్శలు కురిపించారు. నాకు విష్ణుకు పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే మేము నలుగురు పిల్లల్ని కన్నామని విరోనిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.