Thaman: తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో తమన్ ఒకరు. ఇటీవల కాలంలో ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న తమన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈయన తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది అంటూ తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తమ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణమేంటనే విషయానికి వస్తే… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్నారు ఇలాంటి తరుణంలోనే ఈయన కమిట్ అయిన సినిమాలకు కుదిరినప్పుడల్లా షూటింగ్లో పాల్గొంటూ పూర్తి చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో ఓజీ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఏ వేదిక పైకి వెళ్లిన అభిమానులు మాత్రం ఈ సినిమా గురించి మాట్లాడటంతో పవన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా తమన్ సైతం ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ గురించి ఈయన మాట్లాడుతూ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను గ్యాంగ్ స్టార్ పాత్రలో చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది.ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడుతుంటే రక్తం ఉరకలేస్తోంది.
పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ చాలు పిచ్చి ముదిరి పీక్స్ కు చేరడానికి. నేను అన్ని మ్యూజిక్ పరికరాలను మారుస్తున్నా ఈ సినిమా కోసం. రూమ్ నిండా పవన్ కల్యాణ్ పోస్టర్స్ తో నింపి ఉన్నానని ఎక్కడ కూడ ఎనర్జీ తగ్గకుండా ఓజీ మ్యూజిక్ మీ ఊహకు అందనంతలా ఉండేందుకు కృషి చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.