కొబ్బరి నీళ్లతో తులసి ఆకులను కలిపి తీసుకుంటే కలిగే లాభాలివే.. ఈ విషయాలు తెలుసా?

కొబ్బరి నీళ్లలో తులసి ఆకులు వేసి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది, మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరానికి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించే అవకాశాలు ఉంటాయి. కొబ్బరి నీరు, తులసి రెండూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

తులసిలో ఉండే యూజినాల్ మరియు ఉర్సోలిక్ యాసిడ్ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, అంటే శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. కొబ్బరి నీళ్లు, తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. తులసి జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.

తులసి మధుమేహం మరియు దాని తదుపరి సమస్యలను నిర్వహించడంలో ఎంతగానో సహాయపడే అవకాశాలు అయితే ఉంటాయి. తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఆరోగ్యానికి మేలు జరిగేలా చేయడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి.

కొబ్బరి నీళ్లు, తులసి జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లతో తులసి ఆకులను కలిపి తీసుకోవడం ద్వారా చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం కొబ్బరి నీళ్లను తీసుకోకూడదు.