KTR: ఇటీవల కాలంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ నేతలు ప్రతిపక్ష నేతలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైతం కేసులో నమోదు అయ్యాయి. ఏకంగా ఈయనపై రెండు కేసులో నమోదు కావటం గమనార్హం. ఇటీవల పదో తరగతి పరీక్ష పత్రం లీక్ అయింది అంటూ పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కేటీఆర్ పై కేసు నమోదు అయింది.
ఈయనపై నకిరేకల్ పీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి.నకిరేకల్ పట్టణంలో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారని కేటీఆర్ పై మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజిత, కాంగ్రెస్ నేతలు ఈయన పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌తో పాటు సోషల్ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్‌లపై రెండు వేర్వేరు కేసులను నమోదు చేశారు.
పేపర్ లీక్ అయిందంటూ వెబ్‌సైట్ లో వచ్చిన వార్తను వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్లో షేర్ చేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు. అయితే, పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్ బాలికతో పాటు ఐదుగురిని అరెస్టు చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ కూడా వార్తల్లో నిలవడంతో ఆయనకి ఇది ఊహించని షాక్ అని చెప్పాలి మరి తనపై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం పట్ల కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.