Pithapuram: పిఠాపురం రాజకీయాలలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వర్మ…. అసలు వర్మ ప్లానేంటీ!

Pithapuram: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి పార్టీలో అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే పొత్తులో భాగంగా కొంతమంది సీనియర్ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తమ సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితిలో వచ్చాయి అలాంటి వారిలో పిఠాపురం వర్మ ఒకరు.

పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర వర్మకు ఉంది ఆయనకు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఇలా వర్మ ఎమ్మెల్యే టికెట్ వదులుకున్నప్పటికీ ఆయనకి రాజ్యసభ గాను లేదా శాసనమండలి సభ్యుడుగా అవకాశం వస్తుందని భావించారు కానీ ఎలాంటి పదవి చంద్రబాబు నాయుడు ఆయనకి ఇవ్వలేదు.

ఇలా ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ కొనసాగుతుంది ఇలాంటి తరుణంలోనే వర్మ కూడా అదే స్థాయిలో పదవి ఇస్తే అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణాలతో చంద్రబాబు నాయుడు వర్మను పూర్తిగా దూరంపెట్టారు. ఇలా వర్మకు ఎలాంటి పదవి తగ్గకపోవడంతో ఆయన కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తన బాధను మొత్తం బయటకు చెప్పుకోలేక పదవులు ముఖ్యం కాదు కార్యకర్తలే ముఖ్యమని చెప్పకు వస్తున్నారు. అయితే ఇటీవల ఈయన సోషల్ మీడియా వేదికగా ప్రజలే నా బలం కార్యకర్త అధినేత అంటూ సంచలన పోస్టులు చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి బుధవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేయబోతున్నారని తెలుస్తుంది.

ఇలా కార్యకర్త అధినేత అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఈయన అసలు ప్లాన్ ఏంటి అంటూ కూటమినేతలు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పార్టీ పరంగా తీవ్ర స్థాయిలో వర్మ అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్టీ వీడి బయటకు వెళ్లలేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పెద్ద ఎత్తున పిఠాపురంలో పర్యటనలు చేస్తూ పవన్ కళ్యాణ్ కంటే కూడా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందటం కోసం సరికొత్త వ్యూహం రచించారని తెలుస్తోంది.