Suhasini: నాకు ఆ రోగం ఉంది…భయంతో బయట పెట్టలేదు… నటి సుహాసిని షాకింగ్ కామెంట్స్!

Suhasini: సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే. వారికి కూడా మనలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి అయితే సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను పెద్దగా బయట పెట్టరు కానీ కొంతమంది మాత్రం వారికి ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలను బయటపెడుతూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు..

ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తాము పలానా వ్యాధితో బాధపడ్డాము అంటూ బహిరంగంగా తెలియజేస్తున్నారు. అయితే తాజాగా సీనియర్ నటి సుహాసిని సైతం ఇలాంటి జబ్బుతో బాధపడుతున్నారనే విషయాన్ని బయట పెట్టారు.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుహాసిని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరోవైపు ఈమె తన భర్త మణిరత్నంతో కలిసి సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇన్ని రోజులు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అలాగే అనారోగ్య సమస్య గురించి బయటపెట్టారు. తాను టీబీ సమస్యతో బాధపడ్డానని తెలిపారు.

తాను ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాననే విషయాన్ని బయట ఎక్కడ చెప్పుకోలేదు కేవలం భయం కారణంగానే నా రోగాన్ని ఎవరికి చెప్పలేదని 6 నెలలపాట టీబీ వ్యాధికి చికిత్స తీసుకున్నానని సుహాసిని వెల్లడించారు. ఇక ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలున్న తర్వాత తాను ఈ వ్యాధి గురించి బయట పెడుతూ అందరికీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని భావించాను అంటూ ఈమె తన అనారోగ్య సమస్యలను బయట పెట్టడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.