మన దేశంలో ఎంతోమంది ఆస్తమా సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తమా ఉన్న వారికి చలికాలం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరం అలేదు. ఆస్తమా వల్ల శ్వాసకోశ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. చల్లనిగాలి కారణంగా శ్వాసనాళాలు కుంచించుకొని పోవడంతో పాటు ఆస్తమా ఉన్న వారికి ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు వల్ల ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదు. చలికాలంలో ఆస్తమా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నీరు బాగా తాగాలి. డీ హైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శాసకోస సమస్యల అవకాశాలు తగ్గించుకునేందుకు పరిశుభ్రత పాటించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. నోటితో కాకుండా ముక్కుతో గాలి పీలిస్తే కొంత వరకూ ఆస్తమాను అరికట్టవచ్చు.
ఆస్తమా రోగులు కచ్చితంగా ఫ్లూ టీకా తీసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇన్‌హేలర్ వాడటం వల్ల ఈ సమస్యకు వేగంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంట్లో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఇల్లును వ్యాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రపరచడం, దుమ్మూధూళీలేకుండా చూసుకోవడం చేస్తే మంచిది. ఆస్తమా మెడికేషన్లు నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
ఒకసారి ఆస్తమా బారిన పడితే దీర్ఘకాలం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తమా సమస్యకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ప్రాణాలకు అపాయం కలగకుండా చేసుకోవచ్చు.