ఈ మధ్య కాలంలో మధుమేహం వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్రం వస్తుంటే డయాబెటిస్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే మంచిది. అతిగా దాహం వేస్తున్నా ఈ లక్షణం మధుమేహంకు సంబంధించిన లక్షణం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
అతిగా ఆకలి వేస్తున్నా ఈ లక్షణం డయాబెటిస్ కు సంబంధించిన సంకేతం కావచ్చు. ఏ కారణం లేకుండా బరువు తగ్గుతున్నా షుగర్ కు సంబంధించిన పరీక్ష చేయించుకుంటే మంచిది. నిత్యం నీరసంగా ఉంటే కూడా షుగర్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలి. కంటిచూపు ఏ కారణం లేకున్నా మనసబారుతుంటే షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నా, గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతున్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వేళ్లు మొద్దు బారినట్టు అనిపిస్తున్న షుగర్ కు సంబంధించిన పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడినా డయాబెటిస్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. డయాబెటిస్ వ్యాధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇతర వ్యాధుల బారిన పడే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. షుగర్ వ్యాధి వల్ల శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.