AP: ఆ డీఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా… హామీ ఇచ్చిన జగన్!

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసిపి నేతలు శ్రేణులతో సమావేశం అయ్యారు. అదేవిధంగా వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త అయిన పవన్ కుమార్ ను జగన్ సోమవారం రోజున కలవడం జరిగింది. సునీల్ యాదవ్ ఫిర్యాదు కేసులో పోలీసులు పవన్ కుమార్ ను అరెస్ట్ చేయగా పులివెందులలో జగన్ పవన్ కుమార్ ని కలిశారు.

సునీల్ యాదవ్ పవన్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పులివెందుల పోలీసులు సోమవారం పవన్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు ఇక పవన్ కుమార్ ని జగన్ కలవడంతో పవన్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ డీఎస్పీఎస్పీ తనను చితక భాధారని తెలిపారు. దీంతో ఆ నిందితుడికి జగన్ పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చారు.

కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఏడాది అయ్యింది మరొక మూడు సంవత్సరాలు పాటు కాస్త ఓపికతో ఉండండి తిరిగి అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే అని తెలిపారు. ఇలా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ డీఎస్పీ అయితే నీపై వేటు వేశారు అదే డిఎస్పీ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తాను అంటూ పవన్ కుమార్ కు భరోసా ఇచ్చారని తెలుస్తోంది.

ఇలా జగన్ ఇచ్చిన భరోసా పట్ల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి ధోరణి మార్చుకొని తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కృషి చేస్తే బాగుంటుందని కొందరు జగన్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం తన వాళ్ళను కూటమి ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారు దీంతో తన వారందరికీ అండగా భరోసాగా జగన్ నిలిచారని భావిస్తున్నారు అయితే పొరపాటున జగన్ ప్రభుత్వం కనుక వస్తే కూటమినేతలు కూటమి నేతలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.