NTR: జపాన్ లో భార్య లక్ష్మీ ప్రయాంతి పుట్టినరోజు వేడుకలు…. క్యూట్ విషెస్ చెప్పిన ఎన్టీఆర్!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జపాన్ లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ తో పాటు డైరెక్టర్ కొరటాల శివ ఇతర చిత్ర బృందం జపాన్ లో ఉంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇలా గత మూడు రోజులుగా ఈయన జపాన్ లో ఉంటూ సందడి చేస్తున్నారు. అయితేనేడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన రేర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులు లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక జపాన్ లోనే ఈమె పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా తన భార్య పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లడించారు. ఇకపోతే ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా అమ్ములు అంటూ పిలుస్తారు. గత ఏడాది కూడా తన భార్యను అమ్ములు అంటూ పిలుస్తూ తనకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక లక్ష్మీ ప్రణతి స్టార్ హీరో భార్య ఆయనప్పటికీ ఈమె మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. చివరికి సోషల్ మీడియాకి కూడా లక్ష్మీ ప్రణతి దూరంగా ఉంటూ కేవలం కుటుంబ బాధ్యతలను మాత్రమే చూసుకుంటూ ఉంటారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వార్ 2, సినిమాతోపాటు ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.